: ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తిన అపరిచితుడు అరెస్టు


విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఓ అపరిచిత వ్యక్తి ఎత్తివేశాడు. పది గేట్లను ఒక అడుగుమేరకు ఎత్తేశాడు . ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా గేట్లను కిందకు దించివేశారు. గేట్లు ఎత్తిన వ్యక్తిని పట్టుకుని పోలీసు అధికారులు అప్పగించారు. కాగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి బ్యారేజ్ గేట్లు ఎత్తడంపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ సంఘటన నేపథ్యంలో బ్యారేజ్ భద్రత విషయమై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News