: ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు అసంతృప్తి!


ఇసుక వల్ల రూ.750 కోట్ల ఆదాయం కోల్పోయినా.. ఉచిత ఇసుక ప్రజలకు అందడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వాన్ని, పార్టీని అనుసంధానం చేసుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

జగన్ నైజం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అని, నాడు సోనియాతో పోరాటం అని చెప్పి.. బెయిల్ కోసం కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి, మోదీ దగ్గరకు వెళ్లి మద్దతు ప్రకటించారని అన్నారు. జగన్ తీరును జనం అర్థం చేసుకుంటున్నారన్నారు. విచారణాధికారులపై విమర్శలు గుప్పించడం జగన్ కు మొదటి నుంచి అలవాటేనని, గతంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారని, ఇప్పుడు ఈడీ అధికారులనూ వదలడం లేదన్నారు.

  • Loading...

More Telugu News