: నాకెంతో భయమన్నది నిజమే... నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనకడుగు ఉండదు: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా రెండో రోజూ తన అభిమానులతో సమావేశమైన వేళ, వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక మాటపై నిలబడనని, నిర్ణయాలు తీసుకోలేనని కొందరు చేస్తున్న ప్రచారాన్ని రజనీ గుర్తు చేశారు. "నేను భయపడతాను. అందులో ఎలాంటి సందేహమూ లేదు. రజనీ స్థిరంగా ఉండరని ప్రచారం జరుగుతోంది. నేను తరచూ మనసు మార్చుకుంటానని అంటున్నారు కూడా. నేను వెనుకాడుతున్నానని కూడా అంటున్నారు. నిజమే... కానీ, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనకడుగు వేసేది లేదు. ఆ సంగతి నా వారైన మీకందరికీ తెలుసు" అని అభిమానుల హర్షాతిరేకాల మధ్య రజనీ వ్యాఖ్యానించారు. ఇవాళ కూడా సుమారు 600 మందికి పైగా అభిమానులు రజనీని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారందరితోనూ ఫోటోలు దిగారు రజనీకాంత్.