: ఒసామా బిన్ లాడెన్ పేరిట 'ఆధార్' కార్డు సృష్టించబోయి బుక్కయ్యాడు!


అమెరికాను గడగడలాడించిన అల్‌ ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌ పేరుతో‌ ఆధార్‌ కార్డును సృష్టించారు. రాజస్థాన్‌ లోని భిల్వాడా జిల్లా మండాల్ పట్టణంలో 'ఈ మిత్ర కియోస్కీ'ని నిర్వహిస్తున్న సద్దాం హుస్సేన్‌ మన్సూరీ అనే యువకుడు అల్‌ ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ పేరుతో ఆధార్‌ కార్డు సృష్టించాలని భావించాడు. దీంతో ఈ మేరకు ఆధార్ అప్లికేషన్ పూర్తి చేసి, తన రిజిస్ట్రేషన్ కేంద్రం ద్వారా ఇతరుల వివరాలు పూర్తి చేసి, లాడెన్ ఫోటోలు మసకగా ఉండేలా అప్ లోడ్ చేశాడు.

అయితే, దీనిని గుర్తించిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సదరు సద్దాం హుస్సేన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఇలా చేయడం వెనుక దేశద్రోహం ఏమైనా ఉందా? ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడా? వంటి వివరాలు ఆరాతీస్తున్నారు. 

  • Loading...

More Telugu News