: స్పీకర్ ను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే రైతు సమస్యలపై చర్చించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. అంతేకాదు, స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. వారందరినీ స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు.
జీఎస్టీ బిల్లుపై చర్చను కొనసాగనివ్వాలని... అందరూ వెళ్లి తమతమ సీట్లలో కూర్చోవాలని సూచించారు. దీంతో, మరింత రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్ నే చుట్టుముట్టారు. ఆయన వెనుక, పక్కన నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీ సభ్యుల గొడవ మధ్యే జీఎస్టీపై చర్చ కొనసాగుతోంది.