: నేడు ఎవరు గెలిచినా నేరుగా ఫైనల్ కే!


ఐపీఎల్ లో మలిదశ ప్రారంభమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు నెగ్గినా నేరుగా ఫైనల్ చేరనుండగా, ఒడిన జట్టు తరువాతి ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు చేరనుంది. ఈ నేపథ్యంలో నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడే ఒక జట్టు హైదరాబాదులో మాత్రమే ఆడనుండగా, మరో జట్టు మాత్రం మరో అడ్డంకిని అధిగమించగలిగితే మాత్రమే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఫైనల్ కు చేరనుంది.

నేటి సాయంత్రం 8 గంటలకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ తో పూణే సూపర్ జెయింట్ తలపడనుంది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన జట్టు, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మ్యాచ్ లో విజేతతో తలపడాల్సి ఉంటుంది. కాగా, పూణేకు ముంబై ఇండియన్స్ పై పేలవమైన రికార్డు ఉంది. సూపర్ స్టార్లు లేనప్పటికీ ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించగా, చడీచప్పుడు లేకుండా పూణే నాకౌట్ కు చేరింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ క్రీడాభిమానులకు పసందైన క్రీడావిందు అందించనుంది. 

  • Loading...

More Telugu News