: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. దివంగత నేతలకు నివాళి.. ప్రారంభంలోనే ఆందోళనకు దిగిన వైసీపీ


ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తీసుకురానున్న జీఎస్టీ బిల్లుకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఈ నేపథ్యంలో, సమావేశం ప్రారంభమైన వెంటనే దివంగత నేతలు దేవినేని నెహ్రూ, నారాయణరెడ్డిలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. అయితే, రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు.

  • Loading...

More Telugu News