: ఈ సినిమా కొంచెం డిఫరెంట్... 66 మంది నిర్మాతలు...హీరో ఒకడే!
సాధారణంగా ఒక సినిమాకి ఒకరు నిర్మాతగా ఉంటారు. భారీ బడ్జెట్ సినిమా అయితే దానికి ఇద్దరో లేక ముగ్గురో నిర్మాతలుగా ఉంటారు. కానీ, తాజాగా ఒక సినిమాకు మాత్రం 66 మంది నిర్మాతలు ఉండడం విశేషం. 'బాబు సాఫ్ట్ వేర్' పేరుతో రూపొందుతున్న ఒక సినిమాను 66 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పెట్టుబడిదారులుగా మారి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నిర్మాణ సంస్థకు 'పీపుల్స్ సినిమా' అని పేరుపెట్టారు. ఒక సినిమాకు ఇంత మంది నిర్మాతలు ఉండడం ఇదే ప్రథమం. ప్రేమ, వినోదం, సస్పెన్స్ ఇవన్నీ కలగలిపి ఉంటాయని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న సురేష్ అడ్డాల తెలిపారు. ఈ సినిమాలో యశ్వంత్, అర్చనారావు, ట్వింకిల్ అగర్వాల్ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి, జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.