: కన్నీరు పెట్టుకున్న కేటీఆర్... 'ఎటువెళ్తున్నాం మనం?' అంటూ ఆవేదన!
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. టీవీ ఛానెల్ లో ప్రసారమైన విజయవాడకు చెందిన సాయిశ్రీ వార్త ఆయనను అంతలా కదిలించింది. 'ప్లీజ్ డాడీ! నా ప్రాణాలు కాపాడు... కనీసం నా పేరిట ఉన్న ఇంటినైనా అమ్మి వైద్యం చేయించు... నన్ను ఎలాగైనా రక్షించు డాడీ!' అంటూ కన్న కూతురు గుండెలవిసేలా ప్రాధేయపడ్డా కన్నబిడ్డ ప్రాణాలను గడ్డిపోచకంటే తేలిగ్గా తీసిపారేసేంత కఠినపాషాణుడైన తండ్రి తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. చిట్టితల్లి అలా అర్ధిస్తుంటే కరగని వ్యక్తి కూడా ఉంటారా? అంటూ బాధపడ్డారు. వెంటనే ట్విట్టర్ లో మానవీయ విలువలు ఇంతలా పతనమవుతున్నాయా? అంటూ ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి తగిలిన దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు.