: అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే ఆ పని చేయాలి: డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి


అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. గుర్గ్రామ్ లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కదిలే కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ అత్యాచారం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించడం ద్వారా జాతికి భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి, రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయాల్సిన అవసరముందన్నారు. 

  • Loading...

More Telugu News