: చిరుత పులిని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి!
కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత రాందాస్ అత్వాలె ఓ చిరుతపులిని దత్తత తీసుకున్నారు. ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లోని భీమ అనే పేరుగల చిరుత పులి సంరక్షణకు ఆయన ముందుకు వచ్చారు. ఒక ఏడాదిపాటు దానికి అయ్యే ఖర్చును ఆయన భరించనున్నారు. కాగా, ముంబై, థానే మధ్య 103 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ పార్క్ నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటంతో అటవీ శాఖ దత్తత పథకాన్ని ప్రవేశపెట్టింది.