: రజనీకాంత్ మాట్లాడింది ఒక పొలిటికల్ జోక్‌!: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విమర్శలు


త‌న‌ అభిమాన సంఘాల నాయకులతో సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ర‌జ‌నీకాంత్ చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియర్ నేత‌, ఎంపీ సుబ్రమణ్యం స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని రజనీ అన్న మాట‌ ఒక పొలిటికల్ జోక్‌గా ఉంద‌ని సుబ్రమణ్య స్వామి అన్నారు. ర‌జ‌నీకాంత్‌ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని, ఆయ‌న‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని విమ‌ర్శించారు. గతంలోనూ ర‌జ‌నీకాంత్‌ వేర్వేరు పార్టీలతో కలిశారే తప్ప, వాటిలోని సిద్ధాంతాలు కూడా పాటించలేదని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. ర‌జ‌నీకాంత్ త‌న నిర్ణ‌యాల‌ను ప‌దే ప‌దే మార్చుకుంటారని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News