: తీపి కబురు చెప్పిన ఐసీఐసీఐ బ్యాంకు.. గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు
ఇటీవలే ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అదే బాటలో పయనిస్తూ... ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ కూడా గృహరుణాలను తగ్గిస్తూ శుభవార్త తెలిపింది. రూ.30 లక్షలలోపు తీసుకునే రుణాలపై వడ్డీరేట్లను 0.30శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆ బ్యాంకు ఇప్పటివరకు గృహరుణాలపై 8.70శాతం వడ్డీరేటును వసూలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా గృహరుణం తీసుకునే వారికి వడ్డీరేటు 8.40 శాతం మాత్రమే కానుంది. మరోవైపు ఉద్యోగినులకు 8.35 శాతం వడ్డీరేటుకే గృహ రుణాలను అందించనుంది.