: హైదరాబాద్ పాతబస్తీలో గాల్లోకి 12 రౌండ్ల కాల్పులు.. నిందితుడి కోసం గాలింపు
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో మరోసారి గాల్లో కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో.. ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన యువకుడి గురించి గాలిస్తున్నారు. షోయబ్ అనే ఓ యువకుడు ఓ పుట్టినరోజు వేడుక సందర్భంగా గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10 తేది అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా పలు వివరాలు తెలిశాయని అన్నారు.