: పాక్ తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించిన భారత్
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌పై గూఢచర్యం ఆరోపణలు మోపుతూ ఎటువంటి సాక్ష్యాలు చూపించకుండానే పాకిస్థాన్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కుల్‌భూషణ్‌కు ఆ శిక్ష అమలు చేస్తే ఊరుకునేది లేదని ప్రకటించిన భారత్.. ఆయనను విడిపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు వాదనలు కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తన వాదనలు వినిపిస్తూ... కుల్‌భూషణ్‌పై తీర్పును తక్షణమే నిలిపివేయాలని కోరింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తెలిపింది. జాదవ్ తీర్పు ప్రతిని పాకిస్థాన్ ఇవ్వలేదని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ కూడా తమ తరఫు వాదనలు వినిపిస్తోంది.