: ఆర్ఎస్ఎస్ లో చేరిన 700 మంది ముస్లింలు


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పనితీరుతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నారు. ఆయన పని తీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చారని ఆ సంస్థ ప్రచారక్ మనోజ్ కుమార్ తెలిపారు. వీరిలో 300 మందిని తాత్కాలిక వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. సిటీలు, టౌన్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లిం యువకులు, ఇతర మతాల ప్రజలు, మహిళలు ఆర్ఎస్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. కొందరు ముస్లింలు చాలా క్రియాశీలకంగా కూడా పని చేస్తున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ పై ముస్లింల ఆలోచనాధోరణి మారిందని... అందుకే ఇందులో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆ సంస్థ కార్యకర్త అహ్మద్ తెలిపారు.

  • Loading...

More Telugu News