: కేజ్రీవాల్ భార్య సునీతకు మళ్లీ కోపం వచ్చింది!


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్న బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య సునీత మరోసారి మండిపడ్డారు. కేజ్రీని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి తీహార్‌ జైలులో పడేస్తానని మిశ్రా చేసిన వ్యాఖ్యలపై సునీత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇప్పుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్న మిశ్రా భవిష్యత్‌ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలేనని, నమ్మకద్రోహం నుంచి పుట్టాయని విరుచుకుపడ్డారు. జరగబోయే పరిణామాలను అతను ఆహ్వానించాల్సి ఉంటుందని, దానికి అతను అంగీకరిస్తాడా? అంటూ తన సోషల్ మీడియాలో సునీత ప్రశ్నించారు. కపిల్ మిశ్రా గత వారంలో కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసిన వేళ కూడా సునీత మండిపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News