: ఆ విషయం తెలుసుకుని 200 మంది సీఈవోలు చంద్రబాబును కలవడానికి భయపడ్డారు: రోజా


విరాళాల కోసం, దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అవినీతి జాబితాలో ఏపీని మొదటి స్థానంలో చంద్రబాబు నిలిపారని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి తెలిసి దాదాపు 200 కంపెనీల సీఈవోలు... బాబును కలవడానికి భయపడ్డారని విమర్శించారు. రెండున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ముఠా రూ. 2 లక్షల కోట్లను దోచుకుందని మండిపడ్డారు.

 రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి తెలియజేయడానికే ప్రధాని మోదీని జగన్ కలిశారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు, అవినీతికి పాల్పడ్డ సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమండ్ చేశారు. నారా లోకేష్ ఆస్తులు కేవలం 5 నెలల కాలంలో 22 రెట్లు ఎలా పెరిగాయో చెప్పాలని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News