: ఫ్యాన్స్ తో కబాలీ... ఉర్రూతలూగిపోతున్న అభిమానగణం
ముందుగా చెప్పినట్టుగానే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఉదయం తన అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. నేడు మూడు జిల్లాల అభిమానులు ఆయన్ను కలుసుకునేందుకు చెన్నై రాగా, రాఘవేంధ్ర కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. కన్యాకుమారి, దుండిగల్ జిల్లాల అభిమానులను నేడు ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితమే రజనీకాంత్, సభా వేదికకు రాగా, అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
కాగా, కేవలం గుర్తింపు కార్డున్న అభిమానులకు మాత్రమే లోనికి అనుతిస్తుండగా, నేటి నుంచి ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఇక గత కొంతకాలంగా తన రాజకీయ ప్రవేశంపై ఎటూ మాట్లాడని రజనీకాంత్, ఈ సమావేశాల తరువాత ఓ స్పష్టతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన సొంత పార్టీ పెడతారా? లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? లేక అసలు రాజకీయాలే వద్దని అనుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.