: 56 వేల మంది కాదు.. 2 లక్షల మంది ఉద్యోగాలు ఊస్టింగ్.. తేల్చి చెప్పిన హెడ్‌హంటర్స్ ఇండియా


ప్రస్తుతం ఎటు చూసినా ఐటీ ఉద్యోగుల గురించిన వార్తలే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బతో వేలాదిమంది ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు పలు ఐటీ సంస్థలు రంగం సిద్ధం చేశాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అమెరికాలోని భారతీయ ఉద్యోగులకు పింక్‌స్లిప్‌లు ఇస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగ్జిక్యూటివ్‌ల ఎంపికలో సాయపడే హెడ్‌హంటర్స్ ఇండియా బాంబు పేల్చింది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లోని 56 వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నిజానికి ఆ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని చెప్పి గుబులు రేపింది.

అంతేకాదు వచ్చే మూడేళ్లలోనూ అంతే సంఖ్యలో ఉద్యోగులు ఉద్వాసనకు గురికాక తప్పదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన కె.లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 17న నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ సదస్సులో మేకిన్సే అండ్ కంపెనీ ఇచ్చిన నివేదికను ఉదహరించారు. ప్రస్తుత ఐటీ ఉద్యోగుల్లో దాదాపు సగం మంది రాబోయే మూడునాలుగేళ్ల అవసరాలకు తగినట్టు ఉండరని నివేదిక పేర్కొంది. అంటే అటువంటి వారికి సంస్థలు చెక్ చెప్పడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News