: అమెరికాలో రోడ్డు ప్రమాదం... చిత్తూరు జిల్లా నగరికి చెందిన విద్యార్థి దుర్మరణం


అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. లింకన్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా నగరికి చెందిన సాయికుమార్ అడ్లూరి (23) మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ తాగిన మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. సాయికుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చరిష్మా దుడ్డె (23) అనే యువతి కూడా ఉంది. ఆమె ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది. నార్తరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయికుమార్  గతేడాదే యూనివర్సిటీలో చేరాడు.

  • Loading...

More Telugu News