: దేశ ప్రధానిని ఎవరైనా కలవొచ్చు: పురందేశ్వరి


ప్రధాని మోదీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇటీవల కలిసిన విషయమై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ, దేశ ప్రధానిని ఎవరైనా కలవొచ్చని, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధాని అపాయింట్ మెంట్ ను తప్పుబట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జగన్ పై ఉన్న కేసులకు సంబంధించి ఆయనపై ఆరోపణలు ఇంకా రుజువు కాలేదని, అవి రుజువు కానంత వరకూ ఎవరినీ దోషిగా భావించలేమని అన్నారు. బీజేపీ కార్యకర్తలకు గుర్తింపు లేకున్నా మిత్ర ధర్మం నెరవేరుస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News