: ఆయన ఫోన్ నంబర్ మూగబోలేదు.. నేను అందుబాటులో ఉంటా: అభిమానులతో దేవినేని అవినాష్
దేవినేని నెహ్రూ ఫోన్ నెంబరు మూగబోలేదని, ఆ నెంబరుకు ఫోన్ చేస్తే తాను అందుబాటులో ఉంటానని టీడీపీ యువనేత దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలోని గుణదలలో నిర్వహించిన ‘దేవినేని అభిమానుల సదస్సు’లో ఆయన మాట్లాడుతూ, ‘నెహ్రూ గారు ఏ మీటింగ్ కి వెళ్లినా చాలా గట్టిగా చెప్పేవారు. ఆయన ఫోన్ నెంబర్ 9848112369 చెప్పి.. మీరు ఏ నిమిషం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పేవారు. ఆయన ఫోన్ నెంబర్ మూగబోలేదు. ఆ నెంబర్ కు ఏ నిమిషం ఫోన్ చేసినా మీకు నేను అందుబాటులో ఉంటాను. ఈ ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయి. దేవినేని నెహ్రూను ఎవరైతే నమ్ముకున్నారో వారి బాధ్యతను నేను తీసుకుంటాను. మీ కోసం పోరాటం చేస్తాను. నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది’ అని అవినాష్ చెప్పుకొచ్చారు.