: స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఏదీ పట్టించుకోను: 'సర్కారు-3‘ రచయిత జయకుమార్


స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు తానేదీ పట్టించుకోననని ‘సర్కార్-3’ చిత్రానికి స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన తెలుగు కుర్రోడు జయకుమార్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, స్క్రిప్ట్ రాసేటప్పుడు అది తప్ప, వేరే లోకం అంటూ తమకు ఉండదని అన్నారు. ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు జరిగిన ఓ సందర్భం గురించి ఆయన ప్రస్తావిసూ.. ‘ఆర్జీవీ గారు నన్ను పిలవగానే పెద్దజుట్టు, గడ్డంతో ఉన్న నేను వెళ్లాను. ‘ఏంటీ ఇలా అయిపోయావు?’ అన్నారాయన.

‘ఇంకా ఫ్రెషప్ అవలేదు’ అని చెప్పాను. స్క్రిప్ట్ రాయడం ప్రారంభిస్తే అంత సీరియస్ గా ఉంటాను. సర్కారు-3 చిత్రం స్క్రిప్ట్ ను రెండు నెలల్లో రాశాను. అయితే, స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చివరి సీన్ షూటింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News