: మంచి రిలేషన్ షిప్ ఉంటే ఆ ఆలోచన రాదు: నటి అమల అక్కినేని


ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు నాగార్జున భార్య, నటి అమల ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో అమల తల్లి మేహ్యూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ, జంతువులపై ప్రేమ కనపరచడమనే లక్షణం తన తల్లిదండ్రుల ద్వారా తనకు సంక్రమించిందని చెప్పింది. తన చిన్న వయసులో తమ ఇంట్లో చాలా పెంపుడు జంతువులు ఉండేవని, వాటన్నింటిని తన తండ్రి తీసుకు వచ్చేవారని చెప్పారు.

అయితే, పెంపుడు జంతువుల పోషణకు, సేవ చేసేందుకు తన తల్లి ఏనాడూ అడ్డు చెప్పేది కాదని, ఆ లక్షణమే తనకు వచ్చిందని అమలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న సంఘటనలు చూస్తున్నామని.. ఈ విషయమై స్పందించాలని కోరగా, అమల సమాధానమిస్తూ, ‘మంచి రిలేషన్ షిప్ మెయిన్ టెన్ చేసుకోవాలి. చాలామందిలో అది కొరవడింది. అలాంటి రిలేషన్ షిప్ ఉంటే అటువంటి ఆలోచనలు రావు. వృద్ధులైన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ కు పంపించి వేయాలని అనుకోరు. కొట్లాటలు, గొడవలు ఉంటేనే ఇటువంటి సమస్యలు వస్తాయని అనుకుంటున్నాను’ అని బ్లూ క్రాస్ హైదరాబాద్ కో-ఫౌండర్ అయిన అమల చెప్పుకొచ్చారు. కాగా, గత ఐదేళ్లుగాతన తల్లి తనతోనే ఉంటున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News