: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్టు!


ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఓ ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఉగ్రవాది నసీర్ అహ్మద్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన నసీర్ ను శస్త్ర సీమా బల్ నిన్న అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో విచారణా అధికారులకు తాను కాశ్మీరీ శాలువాలు, కార్పెట్స్ అమ్మే వ్యాపారిని అని నసీర్ చెప్పాడు.

అయితే, అతని గుర్తింపునకు సంబంధించి సరైన పత్రాలను చూపించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2003 సెప్టెంబర్ నుంచి నసీర్ పాకిస్థాన్ లో నివాసం ఉంటున్నాడు. ముప్ఫై నాలుగేళ్ల నసీర్ జమ్మూకాశ్మీర్ లోని రంబన్ జిల్లాలోని డోల్గామ్ గ్రామానికి చెందిన వాడు. ఏకే-47, ఏకే-56, ఎస్ఎల్ ఆర్, రాకెట్ లాంచర్, అసాల్ట్ రైఫిల్, గ్రెనేడ్స్ ప్రయోగించడంలో బాగా తర్ఫీదు పొందాడు. 

  • Loading...

More Telugu News