: ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ ఎమ్మెల్సీ వాకాటిపై సస్పెన్షన్ వేటు వేశారు: వైసీపీ ఎమ్మెల్యే కాకాని
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరైందేనని, అయితే, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయనపై వేటు వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వాకాటిపై కేసుల గురించి, ఆరోపణల గురించి తాము ముందే చెప్పామని, అయినా, ఆయనకు టిక్కెటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారన్నారు.