: పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా పాల్పడుతున్న వారిని ప్రజలే తరిమికొడతారు: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
పక్కా రాష్ట్రానికి ఏజెంట్లుగా పని చేస్తున్న వారిని ప్రజలే తరిమి కొడతారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంత్రి తుమ్మలతో కలిసి ఖమ్మం జిల్లాలోని కల్లూరులో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు అంటూ లేవని, ముఠా నాయకులే ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతూ, పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా పని చేస్తున్న వారిని ప్రజలే తరిమికొడతారని అన్నారు. కేసీఆర్ సంకల్పం ముందు నిలబడలేక దళారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.