: మధ్యప్రదేశ్ సీఎం ఇల్లు పేల్చేస్తానంటూ లేఖ.. నిందితుడి అరెస్టు!
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసాన్ని, ఇతర ప్రముఖ కట్టడాలను పేల్చేస్తామంటూ ఓ వ్యక్తి పోలీసులకు బెదిరింపు లేఖ రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గాలించి పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.