: సూపర్‌స్టార్ రజనీతో ఫొటో దిగాలా?.. అయితే గుర్తింపు కార్డు ఉండాల్సిందే!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఫొటో దిగాలనుకునే వారు ఇక నుంచి గుర్తింపు కార్డు చూపించాల్సిందే. రజనీతో ఫొటో సెషన్లో పాల్గొనే అభిమానులకు గుర్తింపుకార్డులను పంపిణీ చేశామని, అవి ఉన్నవారినే అనుమతిస్తామని ఆల్ ఇండియా రజనీకాంత్ అభిమాన సంఘం నాయకులు వీఎం సుధాకరన్, శివరామకృష్ణలు తెలిపారు. గుర్తింపుకార్డులు లేని అభిమానులు కార్యక్రమానికి రావద్దని సూచించారు. రజనీకాంత్ రేపటి (సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు కోడంబాకంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో అభిమానులతో ఫొటో సెషన్లో పాల్గొననున్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదురవుతున్న నేపథ్యంలో తాజా ఫొటో సెషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.