: వాకాటి సస్పెన్షన్ పై వివరణ ఇచ్చిన చంద్రబాబు
బ్యాంకులకు సుమారు రూ. 400 కోట్ల మేరకు బకాయిలు పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ దాడులకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరావును పార్టీ నుంచి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీలో కలకలం రేగడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. నిజాలు నిగ్గు తేలేవరకూ ఆయనపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, ఆయన తప్పు లేదని తేలితే, సస్పెన్షన్ ను తొలగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్లు ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదన్న సంకేతాలను పంపేందుకే వాకాటిని సస్పెండ్ చేశామని, తప్పు ఎవరు చేసినా ఊరుకోబోయేది లేదని అన్నారు.