: నిప్పును నాలుకతో ఆర్పేస్తున్నాడు.. ఇప్పటికి 200 సార్లు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు.. తాజాగా మరోసారి కూడా!
నిప్పుతో చెలగాటాలు ఆడవద్దు అని పెద్దలు అంటుంటారు. అయితే, న్యూయార్క్ నగరానికి చెందిన ఫర్మాన్ (61) మాత్రం ఆ నిప్పుతోనే ఆటాడుకుంటున్నాడు. నిప్పుతో ఆడుకోవడమే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క నిమిషంలో 30కి పైగా అగ్గిపుల్లల్ని వెలిగిస్తున్నాడు... వెలిగించిన వెంటనే నాలుకతో ఆ నిప్పుని ఆర్పివేస్తున్నాడు. ఆయన ఇప్పటికే 200 సార్లకు పైగా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయినా మరోసారి అందులో చోటు సంపాదించుకోవాలనుకున్నాడు.
తాజాగా 37 అగ్గిపుల్లలను వెలిగించి తన నాలుకతో ఆర్పివేసి గతంలో తన పేరిట ఉన్న 30 అగ్గిపుల్లలను ఆర్పేసిన రికార్డును బద్దలు కొట్టాడు. అగ్గిపుల్లలను ఆర్పేందుకు కేవలం నాలుకనే ఉపయోగించాలి, శ్వాసను మాత్రం ఉపయోగించకూడదన్న రూల్ కూడా వుంది. అగ్గిపుల్లలను ఆర్పడమే కాదు, వెలుగుతున్న 44 టార్చ్‌లను ఆపడం ద్వారా కూడా గతేడాది ఫర్మాన్ ఓ రికార్డు సృష్టించాడు. అవలీలగా 37 అగ్గిపుల్లలను వెలిగించి తన నాలుకతో ఆర్పివేసిన ఆయన వీడియోను మీరూ చూడండి...
https://youtu.be/_HZapQSeA04?t=1m26s