: ‘రాన్సమ్‌ వేర్‌’ వైరస్‌ దాడికి పరిష్కారం కనుగొన్న ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు


సుమారు 100 దేశాల్లోని కంప్యూట‌ర్‌ల‌ను ‘రాన్సమ్‌ వేర్ వాన్నక్రై’ వైరస్‌తో దాడి చేసి హ్యాకర్లు పలు సంస్థలకు వణుకు తెప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిని అధిగమించేందుకు హాంకాంగ్‌లోని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒక కిల్లర్ స్విచ్‌ను కనుగొన్నాడు. @MalwareTechBlog అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ సైబర్ నిపుణుడు ట్వీట్ చేస్తున్నాడు. ఈ కిల్ల‌ర్ స్విచ్‌ను తాను అనుకోకుండా క‌నిపెట్టాన‌ని చెప్పాడు. మాల్‌వేర్ ఉపయోగించే ఒక డొమైన్ నేమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా ఆ వైర‌స్ వ్యాపించ‌డాన్ని ఆపవ‌చ్చ‌ని చెప్పాడు.

హ్యాక‌ర్లు రిజిస్టర్ కాని డొమైన్ మీద ఆధారపడుతున్నారని, దాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా తాము మాల్‌వేర్ వ్యాపించ‌డాన్ని ఆపామని చెప్పాడు. ప్రజలు అత్యవసరంగా తమ త‌మ‌ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, హ్యాక‌ర్లు ఎప్పుడైనా కోడ్ మార్చి మరోసారి అటాక్‌ కి ప్రయత్నించవచ్చని హెచ్చ‌రించాడు. హ్యాక‌ర్లు ఉప‌యోగించిన‌ రాన్సమ్‌వేర్ అనే టెక్నిక్ వ‌ల్ల యూజర్ల ఫైళ్లన్నీ లాక్ అయిపోయిన విష‌యం తెలిసిందే. తాము డిమాండ్ చేస్తోన్న డ‌బ్బుని చెల్లిస్తేనే తిరిగి యూజ‌ర్లు త‌మ ఫైళ్ల‌ను ఓపెన్ చేసుకోవ‌చ్చని హ్యాక‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News