: హిందూ సన్యాసులకు వ్యతిరేకంగా మాట్లాడారు.. ఆయనను చంపేస్తాం: ఆప్ నేతకు బెదిరింపు లేఖ
హిందూ సన్యాసులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను చంపేస్తామని తనకు బెదిరింపు లేఖ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆశిష్ ఖేతన్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం తనకు ఈ లేఖ అందిందని చెప్పారు. ఓ హిందూ సంస్థ తనను చంపేస్తానని బెదిరించిందని పేర్కొంటూ ఆయన ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఓ లేఖ రాశారు. ఇటువంటి బెదిరింపులు తనకి మాత్రమే కాదని, జర్నలిస్టులకు, రచయితలకు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఖేతన్కు వచ్చిన బెదిరింపు లేఖపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... బెదిరింపు లేఖ భయాందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.