: చేతికొచ్చిన కుమారుడిని కోల్పోవడం చాలా బాధాకరం: చంద్రబాబు
మంత్రి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పరామర్శించారు. అమెరికా పర్యటన నుంచి నిన్న తిరిగి వచ్చిన చంద్రబాబు... నేడు నెల్లూరులోని నారాయణ నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, నిషిత్ మరణం తనను ఎంతో బాధించిందని చెప్పారు. నారాయణ విద్యాసంస్థలను నిషిత్ సమర్థవంతంగా నిర్వహించాడని కొనియాడారు. చేతికొచ్చిన కుమారుడుని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. ధైర్యంగా ఉండాలంటూ నారాయణకు సూచించానని తెలిపారు. నిషిత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.