: అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవికుమార్ అనుమానాస్పద మృతి


గతంలో నందికొట్కూరు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవికుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసం ఉంటూ, కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నారు. అలాగే అడ్వకేట్ గా కూడా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఐదు నెలల క్రితం ఆయన వివాహం చేసుకోగా, రెండు నెలల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఆయన తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఆయన పలు వివాదాల్లో కూడా ఉన్నారని, గతంలో ఆయన అసెంబ్లీకి పోటీ చేసిన సందర్భంగా వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన ఐజయ్య కులంపై ఆయన కేసు వేశారని తెలిపారు. అలాగే పలు వివాదాలతో సంబంధాలు ఉన్నాయని. దీంతో ఆయనపై ఎవరైనా దాడి చేశారా? లేక విష ప్రయోగం చేశారా? అన్న దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News