: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి.. కారును ఢీకొన్న లారీ


ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పులివెందుల మీదుగా బెంగళూరుకు వెళుతుండగా నామాలగుండు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులను పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News