: కోలుకున్న సోనియా.. ఆస్పత్రి నుంచి ఇంటికి
విషాహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ శుక్రవారం కోలుకున్నారు. సాయంత్రం ఏడుగంటలకు ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 70 ఏళ్ల సోనియాగాంధీ గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనవరిలో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సోనియా ఇటీవల చికిత్స నిమిత్తం అమెరికా కూడా వెళ్లి వచ్చారు. సోనియా అనారోగ్యం కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి పార్టీకి అందుబాటులో రావాలని ఆకాంక్షిస్తున్నారు.