: గూగుల్ పిక్సల్ 3 ఫోన్లను మేం తయారుచేయడం లేదు.. వార్తలను తోసిపుచ్చిన ఎల్జీ
గూగుల్ పిక్సల్ 3 ఫోన్లను ఎల్జీ తయారుచేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆ సంస్థ కొట్టిపడేసింది. ఆ వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది. గూగుల్ పిక్సల్ 2 ఫోన్ ఇంకా విడుదల కాకముందే పిక్సల్ 3పై జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం హెచ్‌టీసీతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుండడమే. దీంతో పలు కంపెనీలు గూగుల్‌తో ఒప్పందం కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
అయితే గూగుల్ పిక్సల్ 3 ఫోన్‌ను ఎల్జీ రూపొందించే అవకాశం ఉందని వార్తలు హల్చల్ చేశాయి. ఆ అవకాశాన్ని ఎల్జీ దక్కించుకోబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన ఎల్జీ డైరెక్టర్ కెన్హాంగ్ ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు. ఆ వార్తలు వాస్తవ విరుద్ధమని కొట్టిపడేశారు. కాగా, హెచ్‌టీసీ ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా పిక్సల్ ఫోన్లను విక్రయించింది. ఇప్పుడు 50 లక్షల పిక్సల్ 3 మొబైళ్లను విక్రయించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.