: గిన్నిస్‌బుక్‌లోకి ‘ఆదియోగి’.. ప్రపంచంలోనే అతి పెద్ద శివుడి విగ్రహంగా రికార్డు!


ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ‘ఆదియోగి’ (శివుడు) విగ్రహం గిన్నిస్ రికార్డులకెక్కింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ దీనిని ప్రతిష్ఠించింది. ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ విగ్రహం గుండెల నుంచి పై భాగం మాత్రమే ఉండేలా నెలకొల్పిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది అతిపెద్దది. విగ్రహం ఎత్తు 112.4 అడుగులు కాగా, వెడల్పు 96.58 అడుగులు. మార్చి 11న ఆదియోగి విగ్రహాన్ని పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు ప్రపంచంలోనే ఇది అతిపెద్దదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News