: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. మద్రాసు హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు మనీలాండరింగ్
కేసులో శేఖర్ రెడ్డి, అతని అనుచరులను నాలుగు నెలల క్రితం అరెస్టు చేశారు. గత డిసెంబరులో శేఖర్ రెడ్డి సహా అతని అనుచరుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి రూ.106 కోట్ల నగదు, వంద కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.