: తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 22న నల్గొండ జిల్లా మునుగోడులో, 23న నాగార్జున సాగర్ లో, 24 నకిరేకల్, భువనగిరి, హైదరాబాద్ లో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో అమిత్ షా సమావేశం అవుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.