: బీజేపీకి జగన్ మద్దతివ్వడం ప్రజలను మోసం చేయడమే!: మంత్రి సుజయకృష్ణ రంగారావు


రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వైకాపా అధినేత వైఎస్ జగన్‌ మద్దతిస్తానని చెప్పడం, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని ఆ పార్టీ టికెట్ పై గెలిచి, తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి ఇటీవల మంత్రి పదవిని పొందిన సుజయకృష్ణ రంగారావు ఆరోపించారు. ఈ మధ్యాహ్నం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఏ ప్రాతిపదికన బీజేపీకి మద్దతిస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలని డిమాండ్ చేసే జగన్, ఇప్పుడు ఆ పార్టీతో ఎందుకు చేతులు కలిపారని అడిగారు. తన స్వీయ ప్రయోజనాలను కాపాడుకునే ఆలోచన ఈ మద్దతు వెనకుందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News