: టీడీపీలో చేరిన కర్నూలు వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి


కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి, డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. డోన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తన అనుచరులతో కలసి దాదాపు గంటపాటు భారీ ర్యాలీ జరిపిన ఆయనకు తెలుగుదేశం కండువాను కప్పిన కేఈ, టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుబ్బారెడ్డి రూపంలో తమ పార్టీకి విలువైన నాణెం దొరికిందని, దీర్ఘకాలంగా తమ కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందని అన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కేఈ ప్రతాప్ ను ఎమ్మెల్యేగా గెలిపించడమే తన లక్ష్యమని తెలిపారు. కాగా, ఆయనతో పాటు సింగిల్ విండో చైర్మన్లు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు సహా సుమారు రెండు వేల మంది తెలుగుదేశంలో చేరుతున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News