: మార్టిన్ గుప్టిల్ పట్టిన క్యాచ్ ను చూసి ఎవరైనా ఔరా! అనాల్సిందే... వీడియో ఇదిగో!
గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ పట్టిన క్యాచ్ ఐపీఎల్ లో అద్భుతమైన క్యాచ్ లలో ఒకటిగా నిలిచింది. బంతి వేగాన్ని అంచనా వేస్తూ గాల్లో ఎగిరిన గుప్టిల్ దానిని అందుకున్న విధానం... క్రీడాభిమానుల చేత ఔరా అనిపించింది.
ముంబై ఇండియన్స్ జట్టు మంచి జోరుమీదుంది. ఆ జట్టు ఆటగాడు లెండిల్ సిమ్మన్స్ అర్ధ సెంచరీతో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో సిమ్మన్స్ భారీ షాట్ కొట్టాడు. అది సిక్సర్ అని స్టేడియంలో అంతా భావించారు. బంతి కూడా అలాగే దూసుకుపోయింది. రెప్పపాటులో బంతి నేరుగా బౌండరీ లైన్ అవతల పడేదే.... ఇంతలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ అమాంతం గాల్లోకి లేచాడు. ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. ఏమాత్రం అడుగు తడబడకుండా నేలపై జాగ్రత్తగా ల్యాండ్ అయి...ఔట్ సిగ్నల్ చూపాడు. దీంతో సిమ్మన్స్ తో పాటు స్టేడియంలోని వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అంతవరకు ముంబై అభిమానులు కేరింతలు కొట్టగా, గుప్టిల్ క్యాచ్ తో స్టేడియం హోరెత్తిపోయింది. మీరు చూడా ఆ దృశ్యాన్ని చూడండి.
Say hello to the 'Udta Punjabi'! #VIVOIPLonHotstar @MartyGuptill @lionsdenkxip pic.twitter.com/UCAWyXnPju
— Hotstar (@hotstartweets) May 11, 2017