: మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల.. కలకలం


విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పలు సందర్భాల్లో వికటిస్తోంది. ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు కోకొల్లలు. తాజాగా హర్యాణాలోని ఫరీదాబాద్ లో రాజ్కేయా బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఓ పాము పిల్ల వచ్చింది. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. తాను తింటున్న భోజనంలో పాము పిల్ల రావడంతో ఓ విద్యార్థిని హడలి పోయింది. దీంతో అక్కడ అలజడి రేగింది. విద్యార్థినులందరూ భోజనం చేయడం ఆపేశారు. విషయం తెలిసిన పలువురు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, తమకు పెడుతున్న ఆహారం ముతక వాసన వచ్చేదని... అయితే పాము పిల్ల రావడం భయాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈ ఘటన గురించి స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులతో పాటు, మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్న ఇస్కాన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అంతేకాదు, ఆ ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.

  • Loading...

More Telugu News