: ఆంధ్రజ్యోతిలో వార్తలు కన్నీరు తెప్పించాయి: ఎంపీ నాని


మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణం తరువాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వార్తలు తనకు కన్నీరు తెప్పించాయని పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆ దినపత్రికలో వచ్చిన 'నాన్నా నిషీ ఎక్కడున్నావ్‌?' 'మంచి మనిషికి ఎంత కష్టం', 'తండ్రి కొడుకుల అనుబంధం' తదితర ప్రత్యేక కథనాలు తనను కదిలించి వేశాయని మీడియాకు తెలిపారు. మంత్రి తన గారాల బిడ్డను కోల్పోయారన్న విషయాన్ని ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. నారాయణను పరామర్శించిన ఆయన, బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణం అవుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News