: దళితులకు పెళ్లైతే...ఆ ఊర్లో అన్ని షాపులు బంద్


అంటరానితనాన్ని, వివక్షను పారద్రోలేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా...ఏదో ఒక రూపంలో వర్ణ వివక్ష కనబడుతూనే ఉంటోంది. కర్ణాటకలోని కొప్పళ జిల్లా హిరేబగనాళలో ఆసక్తికర దురాచారం కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రామంలో దళితుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే... ఆ గ్రామంలోని షాపులన్నీ మూసుకుంటాయి. ఈ నిబంధనతో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం విశేషం.

అయితే వారి శుభకార్యాలకు హాజరయ్యే ఇతర ప్రాంతాల దళితులకు మాత్రం ఆ ఊర్లో ఇతర కులస్తులనుంచి ఎలాంటి సహాయసహకారాలు అందవు. తాజాగా ఆ గ్రామానికి చెందిన పుజారీ అనే దళితుడింట వివాహం జరగగా... గ్రామంలోని 7 హోటళ్లు, సెలూన్లతో సహా ఇతర దుకాణాలు మూసివేసి అగ్రవర్ణాలు బంద్‌ పాటించాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మీడియాకు ఎక్కడంతో స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయులు దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News