: పని ఏదైనా ఉత్తరకొరియా వెళ్లొద్దు: అమెరికా పౌరులకు ట్రంప్ ఆదేశం


విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం.. ఇలా పని ఏదైనా సరే ఉత్తరకొరియా వెళ్లవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ పౌరులకు అల్టిమేటం జారీ చేశారు. ఉత్తరకొరియా తాజాగా నలుగురు అమెరికన్లను అదుపులోకి తీసుకుని గూఢచర్యం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వారిపై దేశరక్షణకు భంగం కలిగించారంటూ (దేశద్రోహం) మరో కేసు నమోదు చేసింది. దీనికి తోడు 'అమెరికా మీద అణుబాంబు వేస్తా... వైట్ హౌస్, పెంటగాన్ లను బూడిద కుప్పను చేస్తా'నంటూ కిమ్ జాంగ్ ఉన్ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఉత్తరకొరియా వెళ్లవద్దని ఆ దేశ పౌరులను ఆదేశించారు.

ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా అమెరికన్ ఉత్తరకొరియాలో అడుగుపెడితే తరువాత తీవ్రపరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా, ఉత్తర కొరియా అరెస్టు చేసిన ఆ నలుగురు అమెరికన్లను ఎలా విడిపించాలన్న విషయంలో అమెరికా తర్జన భర్జనలు పడుతోంది.  

  • Loading...

More Telugu News