: ఏడుస్తూ వార్తలు చదివిన యాంకర్... ఇజ్రాయెల్ ప్రధానిపై ఛానెల్ సిబ్బంది ఆగ్రహం.. వీడియో చూడండి


ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయంతో ఒక టీవీ ఛానెల్ యాంకర్ ఏడుస్తూ వార్తలు చదివిన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ లో 49 ఏళ్లుగా పని చేస్తున్న టీవీ ఛానెల్ 1 ను మూసేయాలని ఆ దేశ ప్రధాని ఆదేశించారు. రాజకీయ కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకోగా...ఈ విషయాన్ని వార్తలు చదువుతున్న యాంకర్ గ్యులా ఈవెన్ కు తెలిసింది. దీంతో వార్తలు చదువుతూనే ఆమె కన్నీటి పర్యంతమైంది. అనంతరం టీవీ ఛానెల్ సిబ్బంది ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు మీడియా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లానే వ్యవహరిస్తున్నారంటూ వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News